Banswada: సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి.. కమిషనర్ గోపు గంగాధర్

Banswada: బాన్సువాడ పట్టణంలో ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్; గడువులోగా పన్నులు, బకాయిలు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి.

SALEEM, BANSWADA
Published on: 21 Nov 2026 3:54 PM IST
Banswada
X

Banswada: సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి.. కమిషనర్ గోపు గంగాధర్

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమంలో భాగంగా శనివారం పురపాలక సంఘ కమిషనర్ గోపు గంగాధర్ స్వయంగా పాల్గొని పట్టణ ప్రజలకు ఇంటి పన్నుల చెల్లింపుపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఇంటి పన్నుల ఆదాయం ఎంతో కీలకమని తెలిపారు.

కావున పట్టణంలోని ప్రతి ఇంటి యజమాని తమ ఇంటి పన్నులను నిర్ణీత గడువులోగా చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

పన్ను బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించి పురపాలక సంఘానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA