Banswada: జ్ఞాన సరస్వతి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ – హాజరైన ఎమ్మెల్యే పోచారం
Banswada: బాన్సువాడ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు.
Banswada: జ్ఞాన సరస్వతి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ – హాజరైన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన, నందీశ్వర స్థిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి– శ్రీమతి పుష్ప దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ పవిత్ర మహోత్సవంలో ఆలయ ధర్మకర్త పోచారం శంభురెడ్డి – ప్రేమల దంపతులు, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Next Story




