Banswada: బాన్సువాడలో బోనాల మహోత్సవం పోచారం శ్రీనివాస్ రెడ్డి

Banswada: బాన్సువాడ కోట దుర్గామాత, సాయికృపా నగర్‌లలో ఘనంగా బోనాలు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజ్.

SALEEM, BANSWADA
Published on: 2 Aug 2026 3:39 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో బోనాల మహోత్సవం పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోట దుర్గామాత ఆలయం మరియు సాయికృపా నగర్లో ఆదివారం ఘనంగా నిర్వహించిన బోనాల మహోత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, గురువినయ్ స్వామి మాజీ ఏఎంసీ చైర్మన్ నార్ల రవీందర్ , నార్ల సురేష్, ఎజాస్ ,కౌన్సిలర్ ఖలేఖ్ ,లింగం , హకీమ్ , నర్సన్న చారి , దాసరి శ్రీనివాస్ ,కొట్టం గంగాధర్ స్థానిక కౌన్సిలర్ జంగం రాజశేఖర్, కో-ఆప్షన్ సభ్యులు ముజ్జు, గౌస్ ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story