Banswada: పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు: 72 మంది అరెస్ట్!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి 72 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.4.93 లక్షల నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం.

SALEEM, BANSWADA
Published on: 9 Nov 2026 8:57 PM IST
Banswada
X

Banswada: పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు: 72 మంది అరెస్ట్!

బాన్సువాడ: దీపావళి పండుగ సందర్భంగా బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరాలపై బాన్సువాడ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న మొత్తం 72 మందిని పట్టుకొని, వారి వద్ద నుండి నగదు రూ.4,93,980/-, 46 సెల్‌ఫోన్లు మరియు 23 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలకు సంబంధించి నిందితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి: పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని బాన్సువాడ పోలీసులు తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA