Banswada: అధ్యాపకులను నియమించాలని జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన

Banswada: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్, జువాలజీ అధ్యాపకులను నియమించాలని విద్యార్థుల ర్యాలీ, ఆర్డీఓ రవీందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పణ.

SALEEM, BANSWADA
Published on: 24 Aug 2026 2:42 PM IST
Banswada
X

Banswada: అధ్యాపకులను నియమించాలని జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సివిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సరైన బోధన అందడం లేదని ఆందోళన చేపట్టారు.

కళాశాల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.గత ఏడాది కాలంగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని విద్యార్థులు ఆరోపించారు.

సివిక్స్,జువాలజీ బోధించే అధ్యాపకులను నియమించి రెగ్యులర్‌గా,అర్థమయ్యేలా తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సరైన బోధన లేకపోవడంతో సివిక్స్‌లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఫెయిల్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి అధ్యాపకులను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story