Banswada: బోధనా సామర్థ్యాల పెంపే లక్ష్యం: ఆర్డీఓ రవీందర్ రెడ్డి!
Banswada: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ శిక్షణ తరగతులను ఆర్డీఓ రవీందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.
Banswada: బోధనా సామర్థ్యాల పెంపే లక్ష్యం: ఆర్డీఓ రవీందర్ రెడ్డి!
బాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం శిక్షణ తరగతులను బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.ఎకనామిక్స్, ఫిజిక్స్,సివిక్స్,హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి.
కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తో కలిసి ఆర్డీఓ రవీందర్ రెడ్డి శిక్షణ తరగతులను సందర్శించారు.వివిధ తరగతి గదుల్లో జిల్లా రిసోర్స్ పర్సన్లు అధ్యాపకులకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. శిక్షణలో బోధనా పద్ధతులు,సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను అధ్యాపకులకు వివరిస్తున్న తీరును పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అధ్యాపకుల బోధనా సామర్థ్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
రేపు జిల్లా కలెక్టర్ పరిశీలన...
ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను జిల్లా కలెక్టర్ రేపు పరిశీలించనున్నట్లు ఆర్డీఓ రవీందర్ రెడ్డి వెల్లడించారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, అధ్యాపకులకు అందుతున్న శిక్షణ తదితర అంశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించనున్నట్లు తెలిపారు.




