Banswada: మద్నూర్ మండలంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పర్యటన!
Banswada: మద్నూర్ మండలంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పర్యటించి దేవాదాయ-రెవెన్యూ భూ సమస్యలు, సోమూర్‌లో రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Banswada: మద్నూర్ మండలంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పర్యటన!
బాన్సువాడ: మద్నూర్ బాన్సువాడ ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి మంగళవారం మద్నూర్ మండలంలో పర్యటించారు. మద్నూర్ మండల కేంద్రంతో పాటు కొడ్చిర గ్రామంలో దేవాదాయ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.
భూములకు సంబంధించిన రికార్డులు, హద్దులు, ఆక్రమణలపై స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని త్వరగా నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం సోమూర్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి పరిశీలించారు.గ్రామస్థులు, రైతులతో మాట్లాడి సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు, సూచనలను తెలుసుకున్నారు.
రైతులకు ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని, ప్రతి పట్టాదారు భూమికి సరైన హద్దులను గుర్తించాలని సర్వే సిబ్బందికి సూచించారు.భూ రికార్డుల క్రమబద్ధీకరణతో పాటు గ్రామాల్లోని భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆర్ డి ఓ తెలిపారు. పర్యటనలో మద్నూర్ మండల తహసీల్దార్ ఎం.డి. ముజీబ్, మండల గిర్దావర్ మురళీధర్, సర్వేయర్ వెంకట్, ఎండోమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




