Kamareddy: మారుమూల తండాలో మెగా వైద్య శిబిరం!
Kamareddy: పెద్ద కొడప్‌గల్ మండలం పోచారం తండాలో బాన్సువాడ సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. 150 మందికి పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ.
Kamareddy: మారుమూల తండాలో మెగా వైద్య శిబిరం!
Kamareddy: పోచారం తండా (కామారెడ్డి) మారుమూల ప్రాంతమైన పెద్ద కొడప్ గల్ మండలం పోచారం తండా లో బాన్సువాడ సేవన్ హిల్స్ మల్టీ స్పెషలిస్ట్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం నిర్ణయించిన వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శిబిరం లో డాక్టర్. వాగ్దేవి సామినేని ఎం డి జనరల్ పిజిసియన్, డాక్టర్. దివ్య భవానీ గైనకాలజిస్ట్, డాక్టర్. విశాల్ సింగ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ లతోపాటు వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులచే రోగులకు పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు అందించి శిబిరం లో పాల్గొన్న రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంతా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని గ్రామ సర్పంచ్ కోల సీత బాయి తెలిపారు. ముఖ్యం గా ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. బాన్సువాడ పరిసర ప్రాంతాల్లో సేవన్ హిల్స్ మల్టీ స్పెషలిస్ట్ ఆస్పత్రి వారు సామాజిక బాధ్యతతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ కొనియాడారు.
రాబోయే రోజుల్లో ఇలాంటి మారుమూల గ్రామీణ ప్రాంతా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి సిబ్బందిని కోరారు. శిబిరంలో మొత్తం 150 మంది మహిళలు, వృద్ధులు, చిన్నారులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యామప్ప పాటిల్, పోచారం గ్రామ సర్పంచ్ బాలాజీ పాటిల్,మాజి సర్పంచ్ మదన్,డాక్టర్. పి.గంగా సింగ్, బాన్సువాడ సేవన్ హిల్స్ ఆస్పత్రి రిలేషన్షిప్ మేనేజర్ బోడ్కే. హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.




