Kamareddy: ప్రజా కలెక్టర్ బదిలీ.. భావోద్వేగంలో సిబ్బంది!

Kamareddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిషెట్టి కిరణ్మయి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.

SALEEM, BANSWADA
Published on: 30 April 2026 4:46 PM IST
Kamareddy
X

Kamareddy: ప్రజా కలెక్టర్ బదిలీ.. భావోద్వేగంలో సిబ్బంది!

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిషెట్టి కిరణ్మయి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది ఆమెకు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికారు. సిబ్బంది తన పై చూపిన ఆదరణను చూసి భావోద్వేగానికి లోనయ్ కంట తడి పెట్టారు. అది చూసి సిబ్బంది కూడా భావోద్వేగానికి గురయ్యారు. రెండు సంవత్సరాల సమయంలోనే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రతి వ్యక్తి ని తన కుటుంబ సభ్యునిగా భావించి వారి సమస్యను తన సమస్యగా స్పందించారు కిరణ్మయి. దీంతో ఈ ప్రాంతం లో ఆమె తక్కువ సమయంలోనే అందరి మన్ననలు పొందారు.కార్యాలయం నుండి ఆమె బయటకు వెళ్లేంతవరకు సిబ్బంది పూల వర్షం చల్లుతూ ఘనంగా వీడ్కోలు పలికారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story