Banswada: బాన్సువాడ దళితవాడ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Banswada: బాన్సువాడ దళితవాడ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు. హాజరైన ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు. విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ.

SALEEM, BANSWADA
Published on: 11 Sept 2026 8:52 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడ దళితవాడ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బాన్సువాడ: టీచర్స్ డే సందర్భంగా బాన్సువాడ దళితవాడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు కల్పన అధ్యక్షతన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ముఖ్యఅతిథిగా కాసుల బాలరాజు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ హాజరయ్యారు.

పాఠశాలలో చదువుతున్న 117 మంది విద్యార్థిని విద్యార్థులకు కీర్తిశేషులు బసంత్ కుమార్ జ్ఞాపకార్థం టీచర్స్ డే సందర్భంగా వారి కుమారుడు మనీ, కూతురు ప్రవళిక, ఇద్దరు కలిసి 5000 రూపాయలు నగదును స్కూల్ అభివృద్ధి కి విరాళంగా ఇచ్చారు.

ఆగ్రోస్ చైర్మెన్ కాసుల బాలరాజు చేతుల మీదుగా వాటర్ బాటిల్స్, 117 మంది విద్యార్థులకు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు యెర్వాల కృష్ణా రెడ్డి , చైర్మన్,గురు వినయ్ కుమార్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల రవీందర్ ,నరహరి హెడ్మాస్టర్, విజయ్ కుమార్ హెడ్మాస్టర్, కౌన్సిలర్ శ్యామల, రిటైర్డ్ హెడ్మాస్టర్ సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయ బృందము ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA