Nizamabad: రుద్రూర్ వద్ద ఆటోపై కూలిన మర్రిచెట్టు..ఐదుగురికి తీవ్ర గాయాలు!
Nizamabad: రుద్రూర్ సమీపంలో బోధన్ - బాన్సువాడ ప్రధాన రహదారిపై ఆటోపై మర్రిచెట్టు కూలి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు.
Nizamabad: రుద్రూర్ వద్ద ఆటోపై కూలిన మర్రిచెట్టు..ఐదుగురికి తీవ్ర గాయాలు!
Nizamabad: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ సమీపంలో బోధన్ బాన్సువాడ ప్రధాన రహదారి పై ప్యాసింజర్ ఆటో పై ఒకే సారి కూలి పడ్డ భారీ మర్రి చెట్టు.
ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్తితి విషమం గా ఉండటం తో బోధన్ ఆస్పత్రికి తరలించారు.
పెద్ద గుట్ట దేవుని దర్శనం చేసుకుని బోధన్ కు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీగా ట్రాఫిక్ కు అంతరాయ ఏర్పడింది.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని,క్షతగాత్రులను 108 లో బోధన్ ఆసుపత్రికి పంపించారు.రోడ్డు పై పడ్డ చెట్టును తొలగించారు.




