Mohammadabad: మొహమ్మదాబాద్‌లో భూమ్‌గొండ విగ్రహావిష్కరణ

Mohammadabad: జుక్కల్ మండలం మొహమ్మదాబాద్‌లో కురుమ సమాజ ఆదర్శమూర్తి భూమ్‌గొండ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. సంస్కృతి, ఐక్యతను కాపాడాలని నేతలు పిలుపునిచ్చారు.

VEERANNA, JUKKAL
Published on: 7 Nov 2026 4:27 PM IST
Mohammadabad
X

Mohammadabad: మొహమ్మదాబాద్‌లో భూమ్‌గొండ విగ్రహావిష్కరణ

మొహమ్మద బాద్ (కామారెడ్డి): తరతరాలుగా తమసంస్కృతి,సంప్రదాయాలు,సామాజిక ఐక్యతను కాపాడుకుంటూ వస్తున్న కురుమసమాజానికి ఆదర్శనీయుడైనా భూమ్ గొండత్యాగంమరిచిపోలేనిదని కాంగ్రెస్ పార్టీ జుక్కల్ మండల అధ్యక్షుడు కులకర్ణి రమేష్ దేశాయి అన్నారు. శనివారం జుక్కల్ మండలం మొహమ్మద బాద్ గ్రామం లో నూతనంగా ఏర్పాటు చేసిన భూమ్ గొండ విగ్రహన్ని స్థానిక గ్రామ సర్పంచ్, కురుమ సంఘం ప్రతినిధులు, మండల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో భాగంగా పలువురు వక్తలు మాట్లాడుతు మండలం లొని మొహమ్మద బాద్ గ్రామం లో భూమ్ గొండ మహారాజ్ విగ్రహ ఏర్పాటు చేయడం కేవలం ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమమే కాకుండా సమాజ చరిత్ర ను గుర్తు చేసుకునే సందర్బంగా నిలుస్తోందని అన్నారు. ఆనాటి వారి వరసత్వాన్ని అందిపుచ్చుకొనిభావితరాలకు అందించాలనే ఆకాంక్ష కు ఇదిప్రతికాగానిలువలన్నారు.

ప్రతి ఒక్కరు నేటి సమాజం లో మహనీయుల చరిత్ర ను ఏమాత్రం మర్చిపోకుండా వారసత్వాన్నికాపాడుకుంటూ సమాజ ఐక్యతకు ఆనాడు భూమ్ గొండ మహారాజ్ ఎలా ముందుకు నాడ్ పించడో నేటి తరం సైతం అదే స్పూర్తితో గొర్రెల పెంపకం, పశుపోషణ, వ్యవసాయ అనుబంధవృత్తులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో ఆ సమాజం అందించిన గొప్ప సేవలునేటికిగుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. కష్టాన్నే నమ్ముకొని జీవిస్తూ,తమ వృత్తి నైపుణ్యంతో సమాజానికి సేవలంధించిన కురుమ ప్రజల చరిత్ర ఎంతో గొప్పదన్నారు.

కార్యక్రమం లో మొహమ్మద బాద్ గ్రామ సర్పంచ్ భర్త సూర్నర్ ప్రజ్ఞేష్ కుమార్ (బాలుసార్ ) కురుమ సంఘం గ్రామ అధ్యక్షుడు ఖండు గొండ, మండల అధ్యక్షుడు జుక్కల్ ఖండు గొండ,మాజి మార్కెట్ కమిటి చైర్మన్ కె. సాయాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త అయిల్వర్ రమేష్,అంజి గొండ, బల్దేవ్, పెద్ద గుల్ల సర్పంచ్ మాధవ్ రావ్ దేశాయ్, ఖండే బల్లూరు సర్పంచ్ చాకలి కృష్ణ,బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లి గంగాధర్, బి ఆర్ ఎస్ యువ నాయకుడు వష్రె రమేష్, చిన్న ఎడ్గి మాజి సర్పంచ్ శివాజీ పాటిల్, మల్లు గొండ, మల్లారి యాదవ్రావ్ పాటిల్,హాట్కార్ యాదవ్,లాక్శెట్టి సాయిలు, హన్మగొండ,శంకర్ గొండ, గంగారాం పాటిల్, పట్వారి గంగాధర్, ఎల్. రాములు,శివాజీ పాటిల్ తోపాటు కురుమ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL