Bichkunda: బిచ్కుంద డివైడర్ పనులకు సహకరించండి: ఆర్&బీ డీఈ వినోద్!

Bichkunda: బిచ్కుంద పట్టణంలో చేపడుతున్న సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని ఆర్&బీ డిప్యూటీ ఇంజనీర్ వినోద్, ఎస్సై రాజు కోరారు.

VEERANNA, JUKKAL
Published on: 27 Oct 2026 9:39 PM IST
Bichkunda
X

Bichkunda: బిచ్కుంద డివైడర్ పనులకు సహకరించండి: ఆర్&బీ డీఈ వినోద్!

బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ రూపు రేఖలను మార్చే దిశలో భాగంగా పట్టణం లో చేపట్టుతున్న సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులకు పట్టణ వాసులు ఎలాంటి అడ్డంకులు కల్పించకుండ అభివృద్ధి కి సహకరించాలని ఆర్ అండ్ బి డిప్యూటీ ఇంజనీర్ వినోద్ కోరారు. పట్టణ అభివృద్ధి లో భాగంగా చేపడుతున్న పనులకు ప్రజలు సహకరించాలని అన్నారు. మంగళవారం రాత్రి బిచ్కుంద ఎస్సై గుండెల రాజు, స్థానిక నాయకులతో కలిసి ఆయ కాలనీ వాసులకు పనులపై అవగాహన కల్పించారు.

పనుల్లో భాగంగా యూ టర్న్ ఏర్పాటు పై పట్టణ వాసుల అభిప్రాయాలను తీసుకొని ప్రజలకు రాకపోకలకు గాను ఎలాంటి ఇబ్బంది కల్గకుండా ఉండేందుకు గాను యూ టర్న్ ఏర్పాటు చేస్తామని ప్రజలు సహకరించాలని కోరగా బస్ స్టాండ్ సమీపంలోని మైనార్టీ కాలనీ కి వెళ్లేందుకు గాను ఒక యూ టర్న్ ఏర్పాటు చెయ్యాలని కోరుతు కాలనీ వేసుకుని డిప్యూటీ ఇంజనీర్ దృష్టికి తీసుకురాగా దీనిపై స్పందించిన డిప్యూటీ వినోద్ మాట్లాడుతు భవిషత్తు లో ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా, వాహనదారులకు ఇబ్బందులు కల్గకుండా పూర్తి స్థాయి సర్వే ఆధారంగా యూ టర్న్ ఏర్పాటు కు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు కావాల్సిన తగిన చర్యలు తీసుకుంటారని, నిర్మాణ పనుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయల అభివృద్ధి కి చేపడ్తున్న సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులు సజావుగా పూర్తయేందుకు ప్రజలు అన్ని విధాలా సహకరిస్తే పనులు త్వరగా పూర్తవుతాయాన్ని అధికారులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు అసద్ అలీ, ప్రేమ్ సెట్, సాహెల్ సెట్కార్, ఖలీల్ పాష, కౌన్సిలర్ ముజహీద్, పరశురామ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL