Bichkunda: బెస్ట్ పశు వైద్యాధికారి అవార్డు అందుకున్న డా. వినీత్

Bichkunda: కామారెడ్డి జిల్లా బీచ్కుందలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు. బెస్ట్ పశు వైద్యాధికారి అవార్డు అందుకున్న డాక్టర్ వినీత్ కుమార్. అభినందించిన అధికారులు.

VEERANNA, JUKKAL
Published on: 15 Aug 2026 8:50 PM IST
Bichkunda
X

Bichkunda: బెస్ట్ పశు వైద్యాధికారి అవార్డు అందుకున్న డా. వినీత్

బిచ్కుంద: బిచ్కుంద (కామారెడ్డి ) 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 సంవత్సరానికి గాను ఉత్తమ సేవలు అందించిన పశువైద్య వైద్యుడికి బెస్ట్ పశు వైద్యాధికారి అవార్డు - 2026 లభించింది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా మంత్రి వి.హెచ్.హన్మంత్ రావు , జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మకఅవార్డునుఅందుకున్నారు.

పశువుల ఆరోగ్య పరిరక్షణ, రైతులకు పశువైద్య సేవలు అందించడం, పశుసంవర్ధక రంగంలో అందిస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు.

అవార్డు అందుకోవడం పట్ల సదరు పశువైద్య వైద్యుడు సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులోనూ రైతులు, పశుపోషకులకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని డాక్టర్. వినీత్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు జిల్లా స్థాయి అధికారులు,పశుసంవర్ధక శాఖ సిబ్బంది,రైతులు, పశుపోషకులు అభినందనలు తెలిపారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story