Bichkunda: బిచ్కుందలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం!
Bichkunda: బిచ్కుందలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం: పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్. గురువుల సేవలను గౌరవించడం అందరి బాధ్యత.
Bichkunda: బిచ్కుందలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం!
బిచ్కుంద: విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే గురువుల సేవలకు బిచ్కుంద మండల కేంద్రంలో ఘన గౌరవం లభించింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (GHS)లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈసందర్భంగావారుమాట్లాడుతూఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, విలువలు పెంపొందించడంలో గురువులపాత్రఅపారమనికొనియాడారు. అంకితభావంతో బోధన అందిస్తున్న ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, ఉపాధ్యాయుల సేవలను గౌరవించడం సమాజ బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆత్మీయ వాతావరణంలో జరిగింది.కార్యక్రమం లో ఎం ఇ ఓ ఆనంద్ కుమార్ సభ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మునిసిపల్ చైర్ పర్సన్ శిమ సెట్కార్, వైస్ చైర్ పర్సన్ భాగ్య లక్ష్మి ప్రేమ్ సెట్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగనాథ్, పట్టణ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి, పి సి సి డెలిగేట్ విట్టల్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చింతల్ హన్మాండ్లు,
అసద్ అలీ, కౌన్సిలర్లు నాహుషా నాయక్, దర్పల్ కార్తీక సంతోష్, మారుతీ, ముజాహిదోద్దిన్, గులాం సందని, దర్పల్ గంగాధర్, రవి పాటిల్ లతోపాటు బోగూడ మిది సాయిలు, సర్పంచ్ లు గోపాల్ రెడ్డి, పి ఆర్ టి యు నాయకులు అర్షద్, సీమా శ్రీనివాస్, రచ్చ శివకాంత్ తపస్ ఉపాధ్యాయ యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




