Bichkunda: బిచ్కుంద డిగ్రీ కాలేజీలో ముగిసిన 'ఏఐ' శిక్షణ!

Bichkunda: బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కృత్రిమ మేధ (AI), డిజిటల్ లెర్నింగ్‌పై నిర్వహించిన రెండు రోజుల 'అన్నా-అక్క' శిక్షణ కార్యక్రమం శనివారంతో విజయవంతంగా ముగిసింది.

VEERANNA, JUKKAL
Published on: 20 Jun 2026 6:51 PM IST
Bichkunda
X

Bichkunda: బిచ్కుంద డిగ్రీ కాలేజీలో ముగిసిన 'ఏఐ' శిక్షణ!

బిచ్కుంద: కృత్రిమ మేధ, డిజిటల్ లెర్నింగ్ పై బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన అన్నా - అక్క శిక్షణ కార్యక్రమం శనివారం తో ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపల్ కె. అశోక్ తెలిపారు.

శిక్షణలో భాగంగా కళాశాల విద్యార్థులకు ఏ ఐ, డిజిటల్ లెర్నింగ్ పట్ల అవగాహన కల్పించడంతోపాటు వాస్తవ సమయంలో సమస్య పరిష్కారం లో ఏ ఐ, డిజిటల్ అభ్యాసం యొక్క ఉపయోగాలు, మోసిన్ లెర్నింగ్ మోడల్ పనితీరు విధానం, ఏ ఐ, డి ఎల్, ఎం ఎల్, డి ఎస్ ల మధ్య బేధాలు

సి సి++ జావా యొక్క ప్రాథమిక భవనాలు, ప్రోగ్రామ్ లో కోడ్ అంటే ఏమిటి, సురక్షిత ఇంటర్నెట్ కనెక్షన్, పబ్లిక్ వై ఫై ప్రమాదాలు, నకిలీ వెబ్సైట్, స్కాం లింకులపై అవగాహనతోపాటు సైబర్ భద్రత, అదేవిధంగా విద్యార్థుల నైతికత హక్కులు బాధ్యతలు మొదలగు అంశాలను వివరించారు.

ఈ రెండు రోజుల శిక్షణ పొందిన డిగ్రి తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు బిచ్కుంద పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల 6 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులకు ఏ ఐ, డిజిటల్ నైపుణ్యాలపై జూలై మాసంలో శిక్షణ ఇవ్వనున్నారు.

కార్యక్రమం లో కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ నిజామాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. వేణుగోపాల్, కళాశాల ఏ ఐ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నోడల్ అధికారులు డాక్టర్. వై. సంజీవ్ రెడ్డి, వై. రేవతి, కె. అశ్వినీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్. జి. వెంకటేశం, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్. టి. హన్మండ్లు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story