Bichkunda: రైతుల ఉసురు పోసుకుంటే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదు!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మీడియా సమావేశం నిర్వహించారు.
Bichkunda: రైతుల ఉసురు పోసుకుంటే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదు!
Bichkunda: బిచ్కుంద (కామారెడ్డి) పోరాట యోధుడు తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ల మునుపటిలాగే పాత విధానంలో రైతుకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణం లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ 9 న్నార ఏండ్ల ప్రభుత్వ పాలనలో రైతులకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రైతు భీమ తదితర పథకాలతో రైతులను ఆదుకుందని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఉసురు పోసుకుంటే ఏ ప్రభుత్వం ముందు పడదని కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలని హెచ్చరించారు.
ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు మోసం చెయ్యకుండా రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచించిందని అన్నారు.
రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.రైతుల బాధలను గమనించి యూరియా యాప్ ను తొలగించాలని పాత పద్ధతిలోనే రైతులకు సరిపడ యూరియా అందివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.




