Bichkunda: బిచ్కుంద రూ.43 లక్షలతో జూనియర్ కళాశాల అభివృద్ధి

Bichkunda: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సహకారంతో బిచ్కుంద జూనియర్ కళాశాల ఆధునీకరణ. రూ.43 లక్షలతో మౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్నట్లు వెల్లడి.

VEERANNA, JUKKAL
Published on: 17 July 2026 3:09 PM IST
Bichkunda
X

Bichkunda: బిచ్కుంద రూ.43 లక్షలతో జూనియర్ కళాశాల అభివృద్ధి

బిచ్కుంద: బిచ్కుంద (కామారెడ్డి) స్థానిక ఎమ్మెల్యే సహకారం తో బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడింది. కళాశాల లో నూతన సూచిక బోర్డు ను ఏర్పాటు చేయగా, కళాశాల ఆవరణలో ఇతర మరమ్మత్తు పనులు కొనసాగుతున్నట్లు కళాశాల కమిటి కార్యదర్శి, బిచ్కుంద మున్సిపల్ కౌన్సిలర్ అసద్ అలీ తెలిపారు.

కళాశాల అభివృద్ధి పనుల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు 43 లక్షలు మంజూరు చేయడంతో కళాశాల మౌళిక సదుపాయాల అభివృద్ధి కి ఊతం లభించింది. ఈ నిధులతో కళాశాలలోని విద్యార్థులకు మెరుగైన విద్య వాతావరణం కల్పించేందుకు గాను అవసరమైన పనులు చేపడుతున్నట్లు అసద్ అలీ తెలిపారు.

కళాశాల అభివృద్ధి కి సహకరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కు కళాశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కళాశాలలో చేపట్టుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు.కార్యక్రమం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి, లెక్చరర్ శివ, సీనియర్ అసిస్టెంట్ రజాక్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఖలీల్ తోపాటు కళాశాల లెక్చరర్లు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story