Bichkunda: ఏ ఒక్క రైతు ఇబ్బంది పడొద్దు..లారీల కొరత లేకుండా పక్కా ప్లాన్!

Bichkunda: బిచ్కుంద రైతు సేవ సహకార సంఘం పరిధిలో రైతుల పంటలను సకాలంలో కొనుగోలు చేస్తామని చైర్మన్ నల్చార్ బాలు శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.

VEERANNA, JUKKAL
Published on: 6 May 2026 1:25 PM IST
Bichkunda
X

Bichkunda: ఏ ఒక్క రైతు ఇబ్బంది పడొద్దు..లారీల కొరత లేకుండా పక్కా ప్లాన్!

బిచ్కుంద: బిచ్కుంద (కామారెడ్డి) ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల పంటలను సకాలంలో కొనుగోలు చేసి ఎ ఒక్క రైతు ఇబ్బంది పడకుండ ఉండేందుకు కావలసిన తగు చర్యలు తీసుకుంటామని బిచ్కుంద రైతు సేవ సహకార సంఘం చైర్మన్ నల్చార్ బాలు శ్రీహరి అన్నారు. తమ కల పరిమితి గత సంవత్సరం ఫిబ్రవరి లో ముగిసినందువల్ల రైతులకు ఎలాంటి న్యాయం చెయ్యలేకపోయామని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చైర్మన్ లందరు హైకోర్టు ను ఆశ్రయించడం తో స్పందించిన కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో మళ్లీ పాత వారికే బాధ్యతలు అప్పగించడం జరిగిందని తమ సహకార సంఘ పరిధిలోని ఎ ఒక్క గ్రామంలో రైతు ఇబ్బంది పడకుండ ఉండేందుకు గాను ప్రభుత్వం ద్వార ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మొక్క జొన్న, వరి ధాన్యం, జొన్న పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి కంటాలు, గని బ్యాగులు, లారీల కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు సహనంతో వ్యవహరించాలని రైతులకు సూచించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story