Bichkunda: బిచ్కుంద ప్రజావాణిలో కందర్పల్లి 5వ వార్డు సమస్యలపై వినతి!

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రజావాణిలో కందర్పల్లి 5వ వార్డు డ్రైనేజీ, చెరువు పునరుద్ధరణ, డబుల్ బెడ్‌రూమ్ బిల్లుల పెండింగ్‌పై అధికారులకు వినతిపత్రం.

VEERANNA, JUKKAL
Published on: 17 Aug 2026 5:25 PM IST
Bichkunda
X

Bichkunda: బిచ్కుంద ప్రజావాణిలో కందర్పల్లి 5వ వార్డు సమస్యలపై వినతి!

Bichkunda: బిచ్కుంద (కామారెడ్డి ) బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కందర్పల్లి 5వ వార్డుకు సంబంధించిన పలు ప్రధాన సమస్యలపై వార్డు ప్రజల తరఫున వినతిపత్రాలు సమర్పించారు.వర్షాకాలంలో కందర్పల్లి 5వ వార్డులోని హైవేపై వర్షపు నీరు నిలిచి ఇళ్లలోకి చేరుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే మట్టి రోడ్లు వర్షపు నీటి ప్రవాహానికికొట్టుకుపోతుండటంతోప్రజలుతీవ్రఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. హైవే వెంట శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా నీరు లేక ఎండిపోయిన కందర్పల్లి చెరువు (మారుతికుంట)ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. చెరువుకు నీరు అందించే రెండు కాలువలు మార్గమధ్యంలోమూసుకుపోవడంతోనీటిప్రవాహంనిలిచిపోయిందని, దీంతో భూగర్భ జలాలుసైతంతగ్గిపోతున్నాయనిపేర్కొన్నారు.

కాలువలకు పూడికతీతచేపట్టినీటిప్రవాహాన్నిపునరుద్ధరించడంతోపాటుమారుతికుంట చెరువును అభివృద్ధి చేయాలని కోరారు.మరోవైపు రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు నిర్మించుకున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకుసంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మరోవినతిపత్రంసమర్పించారు.ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, బిల్లులు ఆలస్యం కావడంతో వడ్డీలు పెరిగి ఆర్థిక ఇబ్బందులుఎదుర్కొంటున్నామని తెలిపారు.

కార్యక్రమంలో కె. గంగాధర్, ఇనొద్దీన్ సార్, రోహిదాస్ పటేల్ తదితరులు పాల్గొని 5వ వార్డు ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కందర్పల్లి వాసులకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story