Birkur: బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ
Birkur: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను అందజేసిన సర్పంచ్ అరిగే ధర్మ తేజ.
Birkur: బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ
బీర్కూర్: తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని , రాసుకోవడానికి ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల బీర్కూర్ లో విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందించారు.
కళాశాల ప్రిన్సిపల్ మామిళ్ళ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ అరిగే ధర్మ తేజ చేతుల మీదుగా విద్యార్థులు రాసే పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మెన్ పద్మ మేడం , రిటైర్డ్ ఉపాధ్యాయులు విఠల్ ,కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్,అధ్యాపకులు సత్తన్న , దేవిసింగ్,సతీష్,సౌమ్య,నారగౌడ్, బాలా కిషన్,రాకేష్,సుభాష్,విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




