Navipet: రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి నవీపేట్‌లో బీజేపీ భారీ రాస్తారోకో!

Navipet: నవీపేట్‌లో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా బీజేపీ, కిసాన్ మోర్చా రాస్తారోకో ధర్నా. రైతులకు 18 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్.

K RAVI, BODHAN
Published on: 11 Sept 2026 2:17 PM IST
Navipet
X

Navipet: రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి నవీపేట్‌లో బీజేపీ భారీ రాస్తారోకో!

Navipet: రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నవీపేట్ మండల శాఖ, మండల అధ్యక్షులు, కిసాన్మోర్చా ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద నవీపేట్ మెయిన్ చౌరస్తా ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు. అనంతరం ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేసి సమస్య ను విన్నవించారు.

ఈ సందర్భంగా బీజేపీ నవీపేట్ మండల అధ్యక్షులు ద్యాగ సరిన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, గత కొన్ని రోజులుగా రైతులకు కేవలం ఆరు గంటల మేరకే విద్యుత్ సరఫరా చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ప్రస్తుతం పంటలు కీలకమైన పొట్ట దశలో ఉన్నాయని ఈ సమయంలో సరైన విద్యుత్ అందకపోతే పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో కోతల కారణంగా రైతులు రాత్రింబవళ్లు పొలాల వద్దకు వెళ్లాల్సి వస్తోందని, వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు.

రైతుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, కనీసం 18 గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను వ్యవసాయానికి అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, విద్యుత్ కోతలను వెంటనే నిలిపివేయాలని కోరారు.

రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను మెరుగుపరచకపోతే రైతులతో కలిసి మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ద్యాగ సరిన్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కిషన్ మోర్చా మండల అధ్యక్షులు మోస్ర గోపాల్ బిజెపి జిల్లా కార్యదర్శి రాధా బిజెపి సర్పంచ్ రాజు ఉప సర్పంచ్ సందీప్ యువమోర్చా మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్ వార్డు సభ్యులు పునాది నవీన్ ప్రేమ్ సింగ్ బీజేపీ సీనియర్ నాయకులు పుట్ట శ్రీనివాస్ గౌడ్ బందెల ఆనంద్ గణేష్ మంత సాయన్న కోరే గంగాధర్ సాయి రెడ్డి కార్యకర్తలు రైతులు బీజేపీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN