Jukkal: బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు!
Jukkal: మద్నూర్ మండలంలోని బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
Jukkal: బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు!
Jukkal: మద్నూర్ (కామారెడ్డి ) మద్నూర్ మండలంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన బీడీ కార్మికులందరికి ప్రభుత్వం ద్వార ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ లను మంజూరు చెయ్యాలని కోరుతు సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణి లో పిర్యాదు చేశారు.
మండలం లో కొన్ని సంవత్సరాలుగా బీడీ కార్మికులు కస్టపడి తమ కుటుంబాలను నెట్టుకు వస్తున్నారని వారికి నేటికి ఉండేందుకు గాను ఇండ్లు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వార వీరిని ఎంపిక చేసి ప్రతి ఒక్క బీడీ కార్మికులకు ఇళ్ళు మంజూరు చేసి ఆ కుటుంబాలను ఆడుకోవాలని బిజెపి నాయకులు కోరారు.
కార్యక్రమం లో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు తెప్పవర్ తూకరం, చిన్న ఏక్లార గ్రామ సర్పంచ్ మాధవ్,మండల ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సొసైటీ డైరక్టర్ ఎస్. బాల్ కిసాన్, శివ కుమార్, గోపాల్ తోపాటు బిజెపి పార్టీ కార్యకర్తలు, బీడీ కార్మికులు పాల్గొన్నారు.




