Kamareddy: మోదీ సభకు జుక్కల్ జైత్రయాత్ర.. సోమూర్ నుండి కదిలిన బీజేపీ శ్రేణులు!

Kamareddy: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ బహిరంగ సభకు జుక్కల్ నియోజకవర్గంలోని సోమూర్ గ్రామం నుండి బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు.

VEERANNA, JUKKAL
Published on: 10 May 2026 12:36 PM IST
Kamareddy
X

Kamareddy: మోదీ సభకు జుక్కల్ జైత్రయాత్ర.. సోమూర్ నుండి కదిలిన బీజేపీ శ్రేణులు!

సోముర్ (కామారెడ్డి): భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు జుక్కల్ నియోజకవర్గం నుండి బిజెపి శ్రేణులు తరలివెళ్లారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగే సభను విజయవంతం చేసేందుకు గ్రామం నుండి ఏర్పాటు చేసిన బస్సులో బిజెపి శ్రేణులు తరలివెళ్లారు. మద్నూర్ మండలం సోముర్ గ్రామ సర్పంచ్ సంగ్రామ్ ఆధ్వర్యంలో బస్సుకు బిజెపి పార్టీ జెండా కట్టుకొని ఈ గ్రామం నుండి 30 మంది బిజెపి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరుగబోయే ఆగ్రహ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారని ప్రధాని ప్రసంగాన్ని నేరుగా వినేందుకు గాను గ్రామంలో ఉన్న బిజెపి నాయకులు, కార్యకర్తలను సమీకరించి సికింద్రాబాద్ కు తరలించినట్లు బిజెపి పార్టీ గ్రామ అధ్యక్షుడు రమేశ్ తెలిపారు. కార్యక్రమం లో బసయప్ప, బాబు, బాలాజీ, హనుమంత్, మారుతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story