Bichkunda: జూనియర్ కళాశాలలో BJYM ఆధ్వర్యంలో 'సార్' ఓటరు అవగాహన సదస్సు!

Bichkunda: బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో BJYM ఆధ్వర్యంలో 'సార్' (SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు నమోదు ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

VEERANNA, JUKKAL
Published on: 5 Nov 2026 3:46 PM IST
Bichkunda
X

Bichkunda: జూనియర్ కళాశాలలో BJYM ఆధ్వర్యంలో 'సార్' ఓటరు అవగాహన సదస్సు!

Bichkunda: బిచ్కుంద (కామారెడ్డి ) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సార్ ) అంటే కేవలం ఓటు హక్కును తొలగించే ప్రక్రియ మాత్రమే కాదని తప్పులు లేని అమూల్యమైన ఓటు హక్కు రూపొందించే అర్హులైన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించే ప్రక్రియ అని కామారెడ్డి జిల్లా బి జె వై ఎం ప్రధాన కార్యదర్శి బుడల గంగరాజు అన్నారు.

గురువారం బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బి జె వై ఎం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 యేండ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పకుండ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పై ప్రతి ఒక్కరికి తప్పకుండా పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమం లో ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షుడు రేవన్, ముప్పడి జ్ఞానేశ్వర్, రామగౌడ్, మరుతి, చంద్రకాంత్ పాటిల్, లక్ష్మణ్ చారితోపాటు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL