Bodhan: రుద్రూర్ డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థుల కృషి

Bodhan: రుద్రూర్ ఫుడ్ సైన్స్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని సూచించిన ఏసిపి సోమనాథం.

K RAVI, BODHAN
Published on: 16 July 2026 4:48 PM IST
Bodhan
X

Bodhan: రుద్రూర్ డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థుల కృషి

బోధన్: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మూలించడంతోపాటు డ్రగ్స్ ను అరికట్టాల్సిన బాధ్యత యువతదేనని నార్కోటిక్ ( ఈగల్ ) ఏసిపి సోమనాదం పేర్కొన్నారు. బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ ఫుడ్ సైన్స్ కళాశాల విద్యార్థులకు ఇటీవల డ్రగ్స్ పై వ్యాసరచన, క్విజ్, వివిధ పోటీలో నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను డిఎస్పి సోమనాథం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరుణంలో యువత మత్తు పదార్థాలకు దగ్గర జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ లాంటి వాటికి బానిసలై కుటుంబాలకు సైతం దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండా లన్నారు.

విద్యార్థి దశలో లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని తల్లిదండ్రులకు ఇటు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థినుల సైతం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని అపరిచితులతో దూరంగా ఉండాలని సూచించారు. కన్న తల్లిదండ్రుల కలలను సాకారం చేయడమే లక్ష్యంగా విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ముందు సాగాలని పిలుపునిచ్చారు.

మత్తు పదార్థాలకు బానిసలైన యువకులు ఎంతటి సాహసానికైనా తెగిస్తారని డిఎస్పి గుర్తు చేశారు. డ్రగ్స్ కు బానిసలైన యువకులు దోపిడీలు, దొంగతనాలు హత్యలు, మానభంగాలు చేయడానికి వెనుకాడరని కన్న తల్లిదండ్రులను సైతం హత్య చేసేందుకు మత్తు పదార్థాలు పూనుకుంటాయని వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు.

అనంతరంబోధన్ ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ దూరందర్ సినిమా లాంటి వాటిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని దేశ రక్షణ కోసం పాటుపడాలన్నారు. దేశాన్ని డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండి సన్మార్గాలను ఎంచుకొని అబ్దుల్ కలాం చూపిన బాటలో విద్యార్థులు పయనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సైన్స్ కళాశాల అధిపతి వెంకటరెడ్డి,ఈగల్ టీం సీఐ పూర్ణేశ్వర్, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై మనోజ్ కుమార్ సిబ్బంది ఉన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story