Bodhan: బోధన్‌లో రైతుల కోసం బీజేపీ భారీ ధర్నా!
Bodhan: యాప్‌ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వేధిస్తోందని ఆరోపిస్తూ బోధన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు.
Bodhan: బోధన్‌లో రైతుల కోసం బీజేపీ భారీ ధర్నా!
బోధన్: బోధన్ (15/6)రాష్ట్ర ప్రభుత్వం రైతులను యాప్ ల పేరుతో వేధింపులకు గురించేస్తుందని ఆరోపిస్తూ బోధన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. బోధన్ నియోజకవర్గం ఇంచార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి సోమవారం బీజేపీ నాయకులు తరలి వచ్చారు.
ఈసందర్బంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ఇబ్బందులకు గురించేస్తుందని మండిపడ్డారు. యాప్ ల తో రైతులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.స్మార్ట్ ఫోన్ లు లేని రైతులకు యాప్ గూర్చి తెలియక పోవడం, మరికొంత మంది రైతులు ఫోన్ లను వినియోగించక పోవడం తో యూరియను బుక్ చేసుకో లేక పోతున్నారని పేర్కొన్నారు.
ఓటీపీ ల పేరుతో రైతంగాన్ని అన్ని విధాలా ఆడుకుంటూందని విమర్శలు చేశారు. వెంటనే యాప్ ను తొలగించడం తో పాటు ఎకరాకు 5 బస్తాల యూరియాను నేరుగా అందించాలని డిమాండ్ చేశారు. నిరంతరాయం గా కరెంట్ సరఫరా చేయడం లో సైతం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.
ఇంతవరకు రైతు భీమా ఉసెలేదని సకాలం లో రైతు భీమా ను సైతం అందించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫల మైందని విమర్శలు గుప్పించారు. రైతు ల సమస్యలను తక్షణమే పరిష్కరించని యెడల రైతుల తో కలిసి ఆందోళన బాట పడతామన్నారు. అనంతరం తహసీల్దార్ విట్టల్ కు వినతి పత్రం అందజేశారు.




