Bodhan: ఎమ్మెల్యేల అరెస్ట్‌ను నిరసిస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
Bodhan: బోధన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకురాలు అయేషా ఫాతిమ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
Bodhan: ఎమ్మెల్యేల అరెస్ట్‌ను నిరసిస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
బోధన్: అసెoబ్లీ సమావేశాలకు వెళ్తున్న బిర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ కు నిరసనగా బోధన్ ఆర్డివో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఖరి కి నిరసనగా బీ ఆర్ ఎస్ పార్టీ నాయకురాలు అయేషా ఫాతిమ ఆధ్వర్యంలో లో ఆర్డివో కాకర్యాలయానికి నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు.
వేయి రోజుల పాలనలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను పూర్తిగా నెరవేర్చలేదని వాటికి నిరసనగా ఎమ్మెల్యేలు ఆందోళన చేసేందుకు వెళుతున్న తరుణంలో అక్రమ అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని బోధన్ బీ ఆర్ఎస్ నాయకురాలు మండిపడ్డారు.
తమ ఎమ్మెల్యేలను బేశరథగా విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కు నిరసనగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, టిఆర్ఎస్ కౌన్సిలర్లు ముషీర్ బాబా, అశోక్ రెడ్డి, తోట శ్రీనివాస్, బీ ఆర్ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.




