Bodhan: బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
Bodhan: బోధన్ ప్రభుత్వాసుపత్రిలో పరిశుభ్రత, మెరుగైన వైద్యంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందికి హెచ్చరిక.
Bodhan: బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
బోధన్: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలు ఆమె పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రోగులకు మెరుగైన వైద్యం అందించి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.
కాన్పుల సంఖ్య ప్రభుత్వాసుపత్రిలో పెంచాలని గర్భిణీలకు బాలింతలకు కావాల్సిన సదుపాయాలను అందుబాటులో ఉంచుతామని ఆమె వివరించారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వైద్యులు పర్యవేక్షించాలని కలెక్టర్ వైద్య సిబ్బందితో పేర్కొన్నారు.
బో దన్ ప్రభుత్వ ఆసుపత్రి లో సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్ని విధాల కృషి చేస్తున్నారని మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన ఆసుపత్రి పై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీవో విజయ కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఉన్నారు.




