Bodhan: బోధన్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట దివ్యాంగుల ధర్నా.. ఎస్ఐఆర్ రద్దుకు డిమాండ్
Bodhan: ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేసి, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బోధన్ ఆర్డీవో కార్యాలయం వద్ద దివ్యాంగులు ధర్నా చేశారు.
Bodhan: బోధన్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట దివ్యాంగుల ధర్నా.. ఎస్ఐఆర్ రద్దుకు డిమాండ్
బోధన్: కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దుచేసి ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బోధన్ ఆర్డివో కార్యాలయం ఎదుట వికలాంగులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సై ఆర్ ప్రక్రియ ప్రవేశపెట్టి ప్రత్యక్ష ఓట్లను తొలగిస్తూ తమ ఓట్లని భద్రపరుచుకుంటుందని ఆరోపించారు.
ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు రాములు మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించాల్సిన అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ దానికి అనుగుణంగా నడుచుకునే ఎన్నికల కమిషనర్ను తమ ఏజెంట్గా పెట్టుకుని ప్రతిపక్ష ఓట్లను తొలగించడం దారుణం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై నెల రోజులుగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపడుతున్న ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరమని మండిపడ్డారు.
వెంటనే జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డివో కార్యాలయంలో ఏవో కు వినతిపత్రం అందజేసి నీరసతెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ షాల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు బాబు, లక్ష్మణ్,గంగాధర్, బీరుగొండ, నాగనాథ్ పటేల్ ఉన్నారు.




