Bodhan: సబ్ రిజిస్ట్రార్ తీరుకు నిరసనగా రైటర్ల ధర్నా

Bodhan: బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ చేపట్టి, రిజిస్ట్రేషన్ల నిలిపివేత, కాలయాపనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

K RAVI, BODHAN
Published on: 19 Nov 2026 6:15 PM IST
Bodhan
X

Bodhan: సబ్ రిజిస్ట్రార్ తీరుకు నిరసనగా రైటర్ల ధర్నా

బోధన్: బోధన్ పట్టణం లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంఎదుట దస్తవెజ్ రైటర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. సబ్ రిజిస్టర్ తీరు ను నిరసిస్తూపెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. లేని పోనీ నిబంధన ల పేరుతో రిజిస్ట్రేషన్ ల విషయం లో కోర్రి పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్వే నంబర్ 22 ఏ లో ఉందని రిజిస్ట్రేషన్ లను నిల్పి వేయడం తో పాటు మునిసిపల్ కమిషనర్ అనుమతులుఉన్నప్పటికి వాటిని విస్మరించి రిజిస్ట్రేషన్ ను అపుతున్నాడని దస్త వేజు లేకర్లు ఆరోపణలు చేశారు.

సబ్ రిజిస్టర్ వైఖరి మూలంగా స్లాట్ బుక్ చేసుకున్నవారికి కాలయాపన చేసి స్లాట్ సమయం ముగిసిందని తిరిగి స్లాట్ లను నమోదు చేయిస్తుడని పేర్కొన్నారు. లీగల్ రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్న వాటిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడ న్నారు.

ఉన్న తా ధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సబ్ రిజిస్టర్ తీరు మూ లంగా ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. సబ్ రిజిస్టర్ పై చర్యలు తీసుకునే వరకు నిరసనతో కొనసాగిస్తామని దస్తావేజు లేఖర్లు వెల్లడించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN