Bodhan: సాలురా చెక్‌పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత 4 కేజీల గంజాయి స్వాధీనం

Bodhan: బోధన్ రూరల్ పరిధిలోని సాలురా చెక్‌పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సీఐ విజయ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు.

K RAVI, BODHAN
Published on: 29 Aug 2026 11:00 PM IST
Bodhan
X

Bodhan: సాలురా చెక్‌పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత 4 కేజీల గంజాయి స్వాధీనం

బోధన్: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని సాలురా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బోధన రూరల్ సీఐ విజయ బాబు ఆధ్వర్యంలో పట్టుకున్నారు.

రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని ధర్మబాద్ కు చెందిన గంగగిరి లక్ష్మణ్ 65 అనే వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ పై గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో చెక్పోస్ట్ వద్ద పట్టుకొని విచారించినట్లు ఎస్సై తెలిపారు.

లక్ష్మణ్ మహారాష్ట్ర నుండి బోధన్ వైపు తరలిస్తున్న ఫోర్ కేజీ గంజాయిని స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. లక్ష్మణ్ మహారాష్ట్రలోని ధర్మబాద్ కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు ఎస్ఐ వివరించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story