Bodhan: బోధన్‌లో వైభవంగా సాగిన ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర

Bodhan: బోధన్‌లో ఘనంగా నిర్వహించిన ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర. మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి ప్రారంభించిన వేడుకలు. సుమారు 2000 మంది భక్తుల భాగస్వామ్యం.

K RAVI, BODHAN
Published on: 19 July 2026 7:38 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో వైభవంగా సాగిన ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర

బోధన్: పట్టణంలో ని అచంపల్లి లో గల అలివేలు మంగమ్మ ఆలయం వద్ద నుండి బోధన్ ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ రథయాత్రలో బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి లు పాల్గొని ఈ రథయాత్రను ప్రారంభించారు.

ఒడిస్సా లో జరుగుతున్న పూరి జగన్నాథ రథయాత్రను దేశంలోని ఆయా ప్రాంతాల ప్రజలు వెళ్లలేని పరిస్థితుల్లో వారి సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో రథయాత్రలను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ నిర్వాహకులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం పూరిలో నిర్వహించే రథయాత్ర తరహాలో బోధన్ లో సైతం ఈ రథయాత్రను ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి టిటిడి కళ్యాణ మండపం వద్ద యాత్రను ముగించారు.

యాత్రకు బోధన్ డివిజన్ పరిధిలోని కోటగిరి, పోతంగల్, వర్ని, రుద్రూర్, సాలు రా, రెంజల్, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో నుండి సుమారు 2000 మంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story