Bodhan: HMTV వెబ్ వార్త కు స్పందన.. విద్యాసంస్థల దోపిడీపై విద్యాశాఖ ఉక్కుపాదం
Bodhan: బోధన్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో సాగుతున్న పుస్తకాల వ్యాపారంపై ఎంఈఓ నాగయ్య స్పందించారు.
Bodhan: HMTV వెబ్ వార్త కు స్పందన.. విద్యాసంస్థల దోపిడీపై విద్యాశాఖ ఉక్కుపాదం
Bodhan: బోధన్ పట్టణం లో జరుగుతున్న ప్రైవేట్ పాఠశాలల పుస్తక వ్యాపారం పై ఎట్టకేలకు మండల విద్యా శాఖ అధికారి నాగయ్య స్పందించారు. గత వారం రోజులు గా ప్రైవేట్ పుస్తక వ్యాపారం అనే కథనం కు అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాల ల యాజమాన్యాలకు షో కాస్ నోటీసులు అందించారు.
ఈ సందర్బంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలలో పుస్తక వ్యాపారం కొనసాగించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థల్లో పుస్తకాల వ్యాపారం కొనసాగించిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించేది లేదన్నారు.
తాము ప్రస్తుతం సుమారు 20 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు అందించామని వారి నుండి సరైన జవాబు రానియెడల జిల్లా విద్యా అధికారి దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకున్నందుకు వెనకాడబోమని ఎంఈఓ వివరించారు.




