Bodhan: పేద విద్యార్థినులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కదిలిన రోటరీ సంస్థలు!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 325 మంది పేద విద్యార్థినులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు.
Bodhan: పేద విద్యార్థినులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కదిలిన రోటరీ సంస్థలు!
బోధన్: గ్రామీణ ప్రాంత పేద బాలికలకు ప్రయాణ సౌకర్యార్థం కల్పించే లక్ష్యంతో రోటరీ సంస్థ ఆధ్వర్యంలో 325 మంది అర్హులైన విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు . బోధన్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా 325 లను సైకిళ్లను విద్యార్థినులకు బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం రోటరీ క్లబ్ చేయూతని అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛంద సంస్థలు ఇలా ముందుకు వచ్చి తమ వంతు సహకారాన్ని అందించినట్లయితే ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమానికి రోటరీ ట్రస్ట్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ సహకారం అందిస్తుండగా, రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ బోధన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్‌టీఎన్ ఉదయ్ సుధీర్ పిలానీ బోధన్ రోటరీ క్లబ్ సభ్యులు విద్యాసాగర్, అల్ల రమేష్, కళ్యాణ్, శివ పలువురు పాల్గొన్నారు.




