Nizamabad: బోధన్‌లో ఇసుక మాఫియా ఆగడాలు.. డ్రైవర్లపై దాడి చేసిన నలుగురి అరెస్టు

Nizamabad: బోధన్‌లో ఇసుక టిప్పర్లను అడ్డగించి డబ్బులు వసూలు చేస్తూ, డ్రైవర్లపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన బోధన్ పోలీసులు.

K RAVI, BODHAN
Published on: 23 April 2026 6:35 PM IST
Nizamabad
X

Nizamabad: బోధన్‌లో ఇసుక మాఫియా ఆగడాలు.. డ్రైవర్లపై దాడి చేసిన నలుగురి అరెస్టు

నిజామాబాద్: బోధన్ పట్టణంలోని బాబా గార్డెన్ వద్ద ఇసుక టిప్పర్లను అడ్డగించి, డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేసిన వారిని గురువారం బోధన్ పట్టణ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ అరెస్టు చేశారు. ఎస్ ఎస్ ఓ మాట్లాడుతూ ఇసుక టిప్పర్ల వద్ద అక్రమంగా అడ్డగించి డబ్బులు వసూలు చేసినందుకు, డబ్బులని ఇవ్వని వారిపై దాడి

చేయడానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తుల అరెస్ట్* - *రెండు ఆటోలు స్వాధీనం*.

బోధన్ పట్టణ పరిధిలోని బాబా గార్డెన్ సమీపంలో ఇసుక టిప్పర్లను అడ్డగించి, డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేయయం జరిగింది . వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నాము.

నిందితులు వసీం ఖురేషీ, సయ్యద్ ఓవేస్, షేక్ అర్బజ్ మరియు షేక్ అల్మాస్ అనే నలుగురు వ్యక్తులు

​ఈ నెల 22వ తేదీ సాయంత్రం సుమారు 04:30 గంటల సమయంలో, నిందితులు రెండు ఆటోలలో (TS16UD 0417 మరియు TG16T1362) బాబా గార్డెన్ వద్ద బైపాస్ రోడ్డు నుండి వస్తున్న ఇసుక టిప్పర్ (TG17T1314)ను వెంబడించి, అడ్డగించారు. డ్రైవర్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో, నిందితులు రాళ్లతో టిప్పర్ అద్దాలను పగులగొట్టి, డ్రైవర్‌ను కొట్టి గాయపరిచారు. ​అదే సమయంలో వెనుక నుండి వచ్చిన మరో టిప్పర్ (TS08UD7179) డ్రైవర్ ఈ దాడిని తన ఫోన్‌లో వీడియో తీస్తుండగా, నిందితులు అతనిపై కూడా దాడి చేసి, ఫోన్‌ను లాక్కొని పగులగొట్టారు.

​బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి ​TS16UD 0417 (బజాజ్ ఆటో),​TG16T1362 (బజాజ్ ఆటో) స్వాధీనం చేసుకున్నాము. వారిని రిమాండ్ కు తరలించడం జరిగింది. ​శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, చట్టవిరుద్ధమైన వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరరించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story