Bodhan: రోడ్డుపై వరి నాట్లు.. బోధన్‌లో బీజేపీ వినూత్న నిరసన!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అధ్వాన్నంగా మారిన రహదారులపై బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.

Venkata Thirumala
Published on: 27 Jun 2026 9:58 PM IST
Bodhan
X

Bodhan: రోడ్డుపై వరి నాట్లు.. బోధన్‌లో బీజేపీ వినూత్న నిరసన!

బోధన్: బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బిల్లాల వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు వరి నాట్లు నాటి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, గతంలో ఈ రహదారి మరమ్మతుల కోసం నిధులు మంజూరైనప్పటికీ మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రహదారి మరమ్మతు పనులను ప్రారంభించి ప్రజల సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్, వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుక బాలరాజు, బీజేపీ నాయకులు హనుమాన్లు చారి, పవన్, గుంత గంగాధర్, వినోద్, అరవింద్, వేణు, ఫణి తదితరులు పాల్గొన్నారు.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story