Bodhan: అక్రమ మైనింగ్‌పై కొరడా ఝళిపించిన బోధన్ ఆర్డీవో

Bodhan: బోధన్, చందూర్, వర్ని మండలాల సరిహద్దుల్లో అక్రమంగా మొరం తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్లను ఆర్డీవో విజయకుమారి సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

K RAVI, BODHAN
Published on: 21 Sept 2026 4:02 PM IST
Bodhan
X

Bodhan: అక్రమ మైనింగ్‌పై కొరడా ఝళిపించిన బోధన్ ఆర్డీవో

Bodhan: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరాన్ని తరలించడంతోపాటు మూడు మండలాల అధికారులను ఇబ్బందుల గురిచేస్తున్న మొరం అక్రమ రవాణా దారులపై బోధన ఆర్డిఓ విజయకుమారి కొరడా జూలిపించారు.

బోధన్, చందూర్, వర్ని మండలాల సరిహద్దుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా సర్వే నంబర్ 139/1 లో కొందరు అక్రమ దారులు మొరం తరలిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సోమవారం ఆర్డివో స్పందించారు. ప్రభుత్వ నిబంధనం విస్తరించి మొరం తరలిస్తున్న ట్రాక్టర్లతో పాటు జెసిబిని సైతం సి చేసి కేసుల నమోదు చేశారు.

గత కొద్ది రోజుల నుండి మూడు మండలాల సరిహద్దుల్లో రాత్రి పగలు తేడా లేకుండా మురం తరలిస్తున్న అక్రమదారులపై ఆర్డిఓ కొరడా జుల్పించడంతో అక్రమ దారుల గుండెల్లో రైలు పరిగెత్తాయి.

ప్రభుత్వ నిబంధనలను ఎవరైనా విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డిఓ హెచ్చరించారు. మూడు మండలాలకు సంబంధించిన సంబంధిత సర్వే నంబర్ లో గత కొన్ని ఏళ్ళు గా జరుగుతున్న భూ వివాదాన్ని సంబంధిత మండలాల అధికారులు సర్వే చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఆర్డివో ఆదేశించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN