Bodhan: బోధన్ ఆర్డీవో ఆఫీస్‌లో ‘ప్రజా పాలన’.. అర్జీల స్వీకరణ

Bodhan: బోధన్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆర్డీవో కుమారి 10 అర్జీలను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

K RAVI, BODHAN
Published on: 18 May 2026 7:32 PM IST
Bodhan
X

Bodhan: బోధన్ ఆర్డీవో ఆఫీస్‌లో ‘ప్రజా పాలన’.. అర్జీల స్వీకరణ

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పలువురి వినతులను ఆర్డీవో విజయ్ కుమారి స్వీకరించారు. డివిజన్ పరిధిలోని 10 ఫిర్యాదులు ఆర్డీవో స్పందించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు ఇరిగేషన్ మున్సిపల్ సమస్యలపై తక్షణమే అధికారులు స్పందించి పరిష్కార మార్గాలు ఆలోచించాలని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై సత్వర న్యాయం కు కృషి చేయాలని రెవెన్యూ గ్రామ మున్సిపల్ శాఖ అధికారులను ఆర్డిఓ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న కుల బహిష్కరణ పై అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వేసవికాలం సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సమస్యలను తీర్చేందుకు కృషి చేయాలి అన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story