Bodhan: బోధన్‌లో పల్స్ పోలియో ప్రారంభం.. చిన్నారులకు చుక్కలు వేసిన ఆర్డీవో విజయ కుమారి!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 29వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆర్డీవో విజయ కుమారి ప్రారంభించారు.
Bodhan: బోధన్‌లో పల్స్ పోలియో ప్రారంభం.. చిన్నారులకు చుక్కలు వేసిన ఆర్డీవో విజయ కుమారి!
బోధన్: ప్రతి చిన్నారికి పోలియోచుక్కలు వేయించాలని బోధన్ ఆర్డివో విజయ కుమారి పేర్కొన్నారు. బోధన్ పట్టణం లోని 29వ వార్డు లో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం ను ఆర్డివో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు 0నుండి 5ఏళ్ల లోపు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలన్నారు. బోధన్ ను పోలియో రహిత పట్టణం గా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ పోలియో చుక్కల విషయం లో అవగాహన కల్పించాలని యువత పోలియోచుక్కల పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు.
Next Story




