Bodhan: రైతులకు ఇబ్బందులు కలిగితే సహించేది లేదు.. ఆర్డీఓ విజయకుమారి

Bodhan: బోధన్ ఆర్డీఓ విజయకుమారి బుధవారం సాలూర, రెంజల్, బోధన్ మండలాల్లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.

K RAVI, BODHAN
Published on: 13 May 2026 9:24 PM IST
Bodhan
X

Bodhan: రైతులకు ఇబ్బందులు కలిగితే సహించేది లేదు.. ఆర్డీఓ విజయకుమారి

Bodhan: డివిజన్ పరిధిలోని సాలూర మండలం హున్స,రెంజల్ మండలం కందకుర్తి, బోధన్ మండలం కల్లూరు కి సొసైటీలను బోధన ఆర్డిఓ విజయకుమారి బుధవారం సందర్శించారు. సొసైటీల పరిధిలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పడుతున్న ఇబ్బందుల పై ఆమె ఆరా తీశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏర్పాటు చేసిన సహకారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విండో సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్నను సరఫరా చేసి గిట్టుబాటు ధర పొందాలని ఆయన సూచించారు. రవాణా సదుపాయం, గన్ని బ్యాగుల ఇబ్బందులు తలతెకుండా తత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. ఆమె అంట బోధన్ తాసిల్దార్ విటల్, విండో సిబ్బంది, చైర్మన్ లు ఉన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story