Bodhan: ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. బోధన్ డిపో నేతలు
Bodhan: బోధన్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల నల్లబ్యాడ్జీల నిరసన. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్.
Bodhan: ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. బోధన్ డిపో నేతలు
Bodhan: బోధన్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట కండక్టర్లు డ్రైవర్లు శుక్రవారం నల్లబ్యాడ్జి లతో నిరసన తెలిపే ఆందోళన చేపట్టారు. న్యాయమని డిమాండ్ల కోసం ఆర్టీసీ ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా నిరసన చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆనాటిసి కార్మికుడు ఉండిపోయి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మూతికి నల్ల గుడ్డను కట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ డిపో కార్మిక సంఘం చైర్మన్ దశరథ్ మాట్లాడుతూ కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు.
ప్రభుత్వం స్పందించకపోతే తమ కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉందని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంతోపాటు పిఆర్సిని విడుదల చేయాలన్నారు. కార్మికులకు అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ నుండి చౌరస్తా వరకు డిపో ఎదుట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టిసి కార్మిక సంఘం నాయకులు సంజీవరెడ్డి, కత్తి గంగాధర్, నాని, గంగల రాములు కార్మిక సంఘం నాయకులు ఉన్నారు.




