Bodhan: బోధన్‌లో ఓటరు జాబితా సవరణ ఎస్‌ఐఆర్ కార్యక్రమం
Bodhan: బోధన్ పట్టణంలోని ఆజం గంజ్ ప్రాంతంలో 13, 14వ వార్డుల్లో ఓటరు జాబితా సవరణ ప్రత్యేక (SIR) కార్యక్రమాన్ని నిర్వహించారు.
Bodhan: బోధన్‌లో ఓటరు జాబితా సవరణ ఎస్‌ఐఆర్ కార్యక్రమం
బోధన్: బోధన్ పట్టణంలోని ఆజం గంజ్ ప్రాంతంలో 13వ, 14వ వార్డుల్లో SIR (Special Intensive Revision) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వార్డుల్లో పర్యటించి ఓటరు జాబితా సవరణకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.
కార్యక్రమంలో ఎమ్మార్వో విఠల్, ఆర్‌ఐ, కౌన్సిలర్లు లంక రవి, జ్యోతి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా ప్రజలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించి, ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా తదితర వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.
Next Story




