Bodhan: స్టాఫ్ నర్సుల సస్పెన్షన్ రద్దు చేయాలి బోధన్‌లో ధర్నా
Bodhan: బాన్సువాడ ఘటనలో నర్సుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు విధుల బహిష్కరణ. సస్పెన్షన్ వేటు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్.
Bodhan: స్టాఫ్ నర్సుల సస్పెన్షన్ రద్దు చేయాలి బోధన్‌లో ధర్నా
బోధన్: బోధన్ ప్రభుత్వ అస్పత్రి ఎదుట స్టాఫ్ నర్సులు, సిబ్బంది శుక్రవారం ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్ణయం ను వ్యతిరేకిస్తు విధులు బహిష్కరించి డిజిహెచ్ ఆస్పత్రి ఎదురుగా ఆందోళన చేశారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో కాన్పుల ఆపరేషన్ల సమయం లో పలువురు బాలింతలకు ఇన్ఫెక్షన్కు గురైన ఘటనలో ప్రభుత్వం ఇద్దరు స్టాఫ్ నర్సులను మరియు వైద్యులను సస్పెండ్ చేసింది.
దీనికి నిరసిస్తూ బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు స్టాఫ్ నర్సులు,వైద్య సిబ్బంది నిరసన తెలిపారు.స్టాప్ నర్సుల తప్పేమీ లేదని వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ ఆందోళనలో లో వైద్యులు డా " విగ్నేశ్వర్, డా " సుమన్ కుమార్, స్టాఫ్ నర్సులు మళ్లీశ్వరి,సరిత, ఉష రాణి, జయ, అన్వేష్, టెక్నిషన్స్ శ్యాం, షకీల్, రవి మరియు వైద్య సిబ్బంది పాల్గున్నారు.




