Bodhan: బోధన్ డివిజన్‌లో పక్కదారి పడుతున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు!

Bodhan: బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో యథేచ్ఛగా సబ్సిడీ గ్యాస్ వినియోగం. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజా సంఘాల విమర్శలు.

K RAVI, BODHAN
Published on: 18 Aug 2026 1:50 PM IST
Bodhan
X

Bodhan: బోధన్ డివిజన్‌లో పక్కదారి పడుతున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు!

Bodhan: బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో పేదల కందాల్సిన సబ్సిడీ గ్యాస్ పక్కదారి పడుతుంది. సివిల్ సప్లై అధికారులు సరైన దాడులు చేపట్టకపోవడంతో ప్రతి టిఫిన్ సెంటర్, రెస్టారెంట్లు, టీ స్టాలలో సబ్సిడీ గ్యాస్ వినియోగిస్తున్నారు. పేదలకు దాల్చిన సబ్సిడీ గ్యాస్ ను వ్యాపార వర్గాలు హోటల్లో వినియోగించడం పట్ల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి.

వాస్తవానికి టిఫిన్ సెంటర్లు హోటల్లలో కమర్షియల్ గ్యాస్ వినియోగించాల్సి ఉన్నప్పటికీ సబ్సిడీ గ్యాస్ను వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేస్తేనే తప్ప దాడులు చేయడం లేదని పలు విమర్శలు తలెత్తుతున్నాయి.

బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్, ఎడపల్లి, సాలురా రుద్రూర్, తదితరు మండలాల్లో సబ్సిడీ గ్యాస్ ను టిఫిన్ సెంటర్లు, డాబాలలో, రెస్టారెంట్లలో వినియోగిస్తున్నప్పటికీ పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఈ విషయమై పలు మండలాల్లోని సీల్ సప్లై అధికారులను సంప్రదించగా వారి నుండి సరైన స్పందన రాకపోవడం గమనార్వం.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story