Rudrur: రుద్రూర్‌లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ.. రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో భక్తుల భక్తి పారవశ్యం!

Rudrur: రుద్రూర్ మండల కేంద్రంలో బోనాల పండుగ కోలాహలం. గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం, బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.

K RAVI, BODHAN
Published on: 10 May 2026 6:21 PM IST
Rudrur
X

Rudrur: రుద్రూర్‌లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ.. రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో భక్తుల భక్తి పారవశ్యం!

రుద్రూర్ (బోధన్): బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ మండల కేంద్రంలో ఘనంగా బోనాల పండుగను ఆదివారం నిర్వహించారు. రుద్రూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి రేణుక ఎల్లమ్మ కళ్యాణాన్ని నాలుగు రోజులపాటు వైభవంగా చేపట్టారు. ఎల్లమ్మ దేవి కళ్యాణం సందర్భంగా గౌడ కులస్తులు కఠిన దీక్షను కొనసాగిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టి కోరికన కోరికలు తీర్చాలని మొక్కుకున్నారు. గ్రామాన్ని సుఖ సంతోషాలతో ఉంచడంతోపాటు పాడి పంటలు సమృద్ధిగా పండేలా చూడాలని ఎల్లమ్మ తల్లికి మొక్కులు మొక్కుకున్నారు.

గౌడ సంఘం ఆధ్వర్యంలో భారీగా బోనం ఎత్తి ఊరేగింపు నిర్వహించారు. బైండ్ల వారితో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. గౌడ కులస్తులు తమతోపాటు గ్రామాలలో ఉన్న 36 కుల సంఘాలను ఆయురారోగ్యాలతో ఉంచాలని అమ్మవారిని వేడుకుంటూ గ్రామంలో బోనాలను ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి నైవేద్యాన్ని సమర్పించి యాటలు కోసి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story