Dichpally: డిచ్పల్లి 7వ బెటాలియన్ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు!
Dichpally: డిచ్పల్లి 7వ బెటాలియన్ శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. గరుడ ప్రతిష్ఠ, హోమాలు, ధ్వజారోహణ తదితర పూజా కార్యక్రమాలు.
Dichpally: డిచ్పల్లి 7వ బెటాలియన్ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు!
Dichpally: డిచ్పల్లిలోని 7th బెటాలియన్ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉత్సవాల్లో భాగంగా గరుడ ప్రతిష్ఠ, శాలా ప్రవేశం, హోమకుండ స్థాపన, వాస్తు పూజలు, అగ్ని ప్రతిష్ఠ, అంకురారోపణ, వాస్తు హోమం, ప్రాణప్రతిష్ఠ హోమం, ధ్వజారోహణ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం బలిహరణ, దేవతా ఆహ్వానం, నిత్య హవనం వంటి పూజలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ, మంత్రపుష్పం, హారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ బి. సీతారాం, అధికారులు, సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.




