Bichkunda: జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హౌస్ అరెస్ట్!

Bichkunda: కామారెడ్డి జిల్లా తాడ్వయిలో బీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన మహా ధర్నాకు వెళ్లకుండా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

VEERANNA, JUKKAL
Published on: 23 Jun 2026 11:02 AM IST
Bichkunda
X

Bichkunda: జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హౌస్ అరెస్ట్!

బిచ్కుంద: బిచ్కుంద (కామారెడ్డి) యూరియా సమస్య పై మాజి మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాడ్వయి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ నిర్వహించే మహా ధర్నా కార్యక్రమానికి వెళ్ళకుండా ఉండేందుకు గాను మంగళవారం తెల్లవారు జామున బిచ్కుంద మున్సిపల్ పట్టణంలోని మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే ను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ మాజి ఎమ్మెల్యే షిండే ప్రజాస్వామ్య హక్కులను హరించే ఇలాంటి చేతగాని ప్రభుత్వ చర్యలు తాగవని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత సమస్యలపై పోరాడే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చెయ్యడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనను ప్రజలు గమనిస్తున్నారని రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే వరకు రైతన్నలకు అండగా ఉంటూ నిరంతరం బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం లోని పలు మండలాల్లో తమ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడంపై మండి పడ్డారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story