Armoor: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు!

Armoor: ఆర్మూర్ పట్టణంలోని 23వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ మరియు వార్డ్ కౌన్సిలర్ కలిసి ప్రారంభించారు.

VAMSHI, ARMOOR
Published on: 6 May 2026 7:42 AM IST
Armoor
X

Armoor: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు!

ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ 23 వ వార్డులో సీ.సీ. రోడ్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్.

23 వ వార్డ్ కౌన్సిలర్ బొట్టు రాజు : ఈ సందర్భంగా అన్నారం రాజు మాట్లాడుతూ మా ఒక్క వార్డులో సిసి రోడ్ పనులు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సహకారం వలన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి నిధులు మంజూరు చేయించి 23 వార్డ్ నందు సిసి రోడ్డు నిర్మాణం మా వార్డ్ ప్రజలకు ఎంతో ఆనంద నియం ప్రతి పనుల విషయంలో ప్రజలందరికీ అన్ని విధాల సహకరిస్తున్న పైడి రాకేష్ రెడ్డికి 23వ వార్డు కౌన్సిలర్ అన్నారం రాజు చారి ( బొట్టు రాజు ), కాలనీవాసులు అందరూ కలిసి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, బిజెపి నాయకులు పేదోళ్ల గంగారెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story