Banswada: చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్ర పునర్నిర్మాణం: కాసుల బాలరాజ్

Banswada: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణం చేస్తోందని రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు.

SALEEM, BANSWADA
Updated on: 10 Sept 2026 4:30 PM IST
Banswada
X

Banswada: చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్ర పునర్నిర్మాణం: కాసుల బాలరాజ్

బాన్సువాడ: చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం బాన్సువాడ పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాసుల బాలరాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూస్వామ్య, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్యం, తెగువ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపాయని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.

ఐలమ్మ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని బాలరాజ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఖలేఖ్ , వసంత నందు , జిల్లా యువజన అధ్యక్షులు మధు సుధన్ రెడ్డి , గోపాల్ రెడ్డి తాడ్కోల్ సర్పంచ్ రమేష్ , షాహబ్ , రవీందర్ ,నియోజక వర్గ యువజన అధ్యక్షులు మన్సూర్ , నర్సన్న చారి , గౌస్ ,హన్మండ్లు రజక సోదరులు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story